బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి జీవించే సమయంలో కుటుంబ సభ్యులే తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని, కనీసం ఎందుకు అలా చేశారో కూడా చెప్పలేదని, తనను కేవలం డబ్బు సంపాదించే మెషీన్ గానే భావించారని కన్నీటి పర్యంతమైంది పూనమ్.
Read Also : KGF Chapter 2 : రాఖీ భాయ్ వయోలెన్స్… హీరోల వెనకడుగు !
తానెప్పుడూ ఎవరి గురించి చెడుగా గానీ, తప్పుగానీ మాట్లాడలేదని, తన సొంత పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండేదానిని అని గుర్తు చేసుకుంది. అంతేకాదు “నేను ఈ రోజు వరకు ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదు. నా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడే ముందు మొదట నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించండి” అంటూ ఏడ్చేసింది. కరణ్వీర్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఒక టిష్యూ తీసి పూనమ్ కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాడు. ఇక కొంతకాలం క్రితం ఈ బ్యూటీ శామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. పెళ్లయిన కొన్ని రోజులకే శామ్ హింసిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టింది. తర్వాత భర్త క్షమాపణలు చెప్పడంతో మళ్ళీ రాజీ పడ్డారు.