NTV Telugu Site icon

Poonam Kaur: నేను కూడా ఆ బ్యాచ్ లో చేరిపోతా..

Poonam

Poonam

Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూనమ్ కౌర్. అచ్చ తెలుగు ఆడపడుచులా తన అందంతో కుర్రకారు గుండెలను దోచుకున్న ఈ భామ.. ఆ తరువాత వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ భామ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంది. పూనమ్ సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్ పెట్టడం ఆలస్యం.. నిమిషాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ భామ ఒక సినిమా గురించి ట్వీట్ చేసింది. అదే భగవంత్ కేసరి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 19 న రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ ను అందుకుంది. నెలకొంది భగవంత్ కేసరిగా బాలయ్య నటన వేరే లెవెల్ అయితే.. విజ్జి పాపగా శ్రీలీల నటన పీక్స్ అని చెప్పుకొస్తున్నారు. ఆడపిల్లలు సింహాలు అని.. అలానే పెంచాలని ఈ సినిమాలో అనిల్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఇందులో గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి బాలయ్య చెప్పడం అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..

ఇక తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది. సినిమా చాలా బావుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను కూడా బాలయ్య ఫ్యాన్స్ బ్యాచ్ లో చేరిపోతాను అని చెప్పుకొచ్చింది. ” భగవంత్ కేసరి చూడటం చాలా రిఫ్రెష్‌గా ఉంది.. నేను జై జై బాలయ్య బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నాను.. లడ్కీ కో షేర్ బనావో” అంటూ రాసుకొచ్చింది. దీంతో బాలయ్య అభిమానులు వెల్కమ్ టూ బాలయ్య ఫ్యాన్స్ క్లబ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments