Site icon NTV Telugu

Poonam Kaur: పూనమ్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారట.. ఇదుగో సాక్ష్యం

Poonam

Poonam

టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక  నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్స్ ట్రోల్ చేయడం అమ్మడికి అలవాటు గా మారిందిపోయింది. కొన్ని సార్లు కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఈ బ్యూటీ ఇంకొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో తన అభివృద్ధికి అడ్డొచ్చిన వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకిపారేస్తూ కనిపిస్తుంటుంది. దీంతో పూనమ్ ఏదైనా ఫోటో షేర్ చేసినా, ట్వీట్ పెట్టినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా నా హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లు ఆ పిల్లలు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టేశారు.

పూనమ్ కు ఇప్పుడు 35 ఏళ్లు.. పెళ్లి కాలేదు. మరి ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన వారందరు ఏంటి పూనమ్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారా..? అని కొందరు..  అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు .. ఈ విషయాన్నీ ఎందుకు చెప్పలేదు అని మరికొందరు తమ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పూనమ్ కు పెళ్లి కాలేదు.. ఆ పిల్లలు వారి బంధువుల పిల్లలు అయ్యి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.  ఇకపోతే చాలా గ్యాప్ తరువాత అమ్మడు ‘నాతి చరామి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version