Site icon NTV Telugu

Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!

Pooja Hegde

Pooja Hegde

Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ తాజాగా ‘బ్రో’ టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బ్రో సినిమా టీజర్​ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. బ్రో సినిమాకు ఎలాంటి సంబంధం లేని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ట్రోల్స్ రావడం ఇక్కడ విశేషం. ఇందుకు కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బ్రో చిత్రంకు త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. అయితే బ్రో సినిమా టీజర్‌ ప్రారంభంలో ఓ కమర్షియల్‌ వస్తుండగా.. అందులో పూజా హెగ్డే ఉన్నారు. పూజా యాడ్ కోసమే టీజర్​ను లేట్​గా రిలీజ్​ చేశారంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

పూజా హెగ్డేను బ్రో టీజర్​లో పెట్టడానికే మహేశ్​ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తీసేశావ్‌ అంటూ దర్శకుడు త్రివిక్రమ్​పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ప్రస్తుతం సోషల్​ మీడియా అంతా త్రివిక్రమ్-పూజా హెగ్డేపై చర్చ జరుగుతుంది. ‘పూజా హెగ్డే లేకుండా సినిమాలు తీయరా?’, ‘చిన సన్నివేషంలోనైనా పూజా హెగ్డే ఉండాల్సిందే’, ‘త్రివిక్రమ్​కు పూజా లక్కీ హీరోయిన్’, ‘త్రివిక్రమ్​కు అదో సెంటిమెంట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో, అరవింద సమేత భారీ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

Also Read: SS Rajamouli ISBC: ఐఎస్‌బీసీ చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి!

Also Read: Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!

Exit mobile version