OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా అవకాశం దక్కడం ఒక ఎత్తయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి అదృష్టం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను వరించినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్ నటించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఓజీ 2’లో హీరోయిన్గా ఎంపికైనట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఓజీ’ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓజీ 2’ కూడా తెరకెక్కనున్నట్లు ఇటీవల వచ్చిన అనౌన్స్మెంట్ మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఈ సీక్వెల్లో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే, పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే తొలిసారి ఒకే తెరపై కనిపించబోతున్నారు.
గతంలో కూడా పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే నటించబోతున్నారనే వార్తలు పలుమార్లు వచ్చాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలోని ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు, అంతకుముందు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ప్రాజెక్ట్‌లలో ఆమె పేరు బలంగా వినిపించింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈసారి ‘ఓజీ 2’ ద్వారానైనా ఆ కల నిజమవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రొమియో’ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఆయన, ముందుగా ‘ఓజీ 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్తారా? లేక నాని సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- RaviTeja : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
- Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
- Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
- G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ఇక పూజా హెగ్డే కెరీర్ పరంగా చూస్తే, ఈ సినిమా కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఒకప్పుడు వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా నిలిచిన ఆమెకు ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం లభిస్తే అది ఆమెకు బలమైన కమ్‌బ్యాక్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి పూజా హెగ్డే ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన వస్తేనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై పూర్తి స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!