Site icon NTV Telugu

Akkineni Nagarjuna: నాగార్జునతో పూజాహెగ్డే వ్యాపారం

Pooja Hegde

Pooja Hegde

Akkineni Nagarjuna: కన్నడ కస్తూరి పూజా హెగ్డే తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. దాదాపు అగ్రహీరోలందరితో నటించిన పూజా అక్కినేని ఫ్యామిలీ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’లో, నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన పూజ ప్రస్తుతం ఓ కమర్షియల్‌ యడ్‌లో నాగ్‌తో కలసి షూటింగ్‌లో బిజీగా ఉంది. శీతల పానీయానికి సంబంధించిన ఈ వాణిజ్య ప్రకటన హైదరాబాద్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అర్జున్ మాలిక్ దర్శకత్వం వహించిన యాడ్ త్వరలో విడుదల కానుంది. ఈ యాడ్ ఫిల్మ్ షూట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగ్ తో సినిమాలలో కలసి నటించకున్నా ఇటా వ్యాపార ప్రకటనలో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజ. దీంతో అక్కినేని హీరోలు ముగ్గురితో కలసి నటించినట్లయింది.

Read Also: Samantha: అభిమానుల ముందుకి సామ్… దర్శకుడి మాటలకి కన్నీళ్లు పెట్టుకుంది

గతేడాది నాగార్జున ‘ఘోస్ట్, బంగార్రాజు’ చిత్రాల్లో నటించారు. ఇందులో ‘బంగార్రాజు’ పర్వాలేదనిపించగా ‘ఘోస్ట్’ నిరాశపరిచింది. నాగార్జున ప్రస్తుతం తనయుడు అఖిల్ తో కలసి థమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ పూజా హెగ్డే నాలుగు సినిమాల్లో కనిపించింది. అయితే ఆ నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. తెలుగులో ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’, తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్‌లో ‘సర్కస్‌’ సినిమాల్లో నటించగా అన్నీ ఘోర పరాజయం పొందాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా పూజ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version