Site icon NTV Telugu

Pooja Hegde: ‘రాధేశ్యామ్’ ఫ్లాప్ టాక్.. సంచలన వ్యాఖ్యలు చేసిన బుట్టబొమ్మ

Radheshyam

Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11 న రిలీజ్ అయినా విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే నోరువిప్పింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఏ సినిమాకైనా అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని సినిమాలు ఓకే ఓకే గా ఉన్నా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటాయి.

ఇంకొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోకపోయినా చూడడానికి బావుంటాయి.” అని చెప్పుకొచ్చింది. అంటే ఇప్పుడు రాధేశ్యామ్ హిట్ టాక్ తెచ్చుకోకపోయినా చూడడానికి బావుంటుంది అనే విధంగా అమ్మడు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీనిపై అభిమానులు స్పందిస్తూ ఇంకా పూజా ఆ రాధేశ్యామ్ లోకం నుంచి బయటికి రాలేదనుకుంటా అని కొందరు.. పూజా చెప్పినదాంట్లో కూడా నిజం లేకపోలేదు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version