Site icon NTV Telugu

Pooja Hegde: పూజా.. నీ ప్యాంట్ చిరిగింది.. చూసుకో

Pooja

Pooja

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక మంచి హిట్ కోసం కష్టపడుతూనే ఉంది. రాధేశ్యామ్ నుంచి ఇప్పటివరకు అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం పూజా ఆశలన్నీ.. సల్మాన్ తో నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మీదనే ఉన్నాయి. తమిళ్ లో వీరమ్ , తెలుగులో కాటమరాయుడు సినిమాను హిందీలో సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచేసింది. వరుస ఇంటర్వ్యూలతో పూజా బిజీగా మారింది.

NTR-ANR: యన్టీఆర్ డేట్స్ తో ఏయన్నార్ ఏం చేశారు!?

ఇక పూజా ఫ్యాషన్ గురించి తెల్సిందే. మొదటి నుంచి కూడా అమ్మడు అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటుంది. ఇక ఇది బాలీవుడ్ సినిమా కావడంతో తనలోని ఫ్యాషన్ మొత్తాన్నినిద్రలేపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూకు పూజా వేసుకున్న డ్రెస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్, డెనిమ్ బ్లాక్ జీన్స్ వేసుకుంది. అయితే ఆ జీన్స్ రెండు వైపులా కిందవరకు కట్ చేసి ఉంది. అంటే థైస్ పై వరకు జీన్స్ షార్ట్ లా ఉండి . మిగతాది అంతా అలా వదిలేసింది. దీంతో ఆ జీన్స్ ను.. అమ్మడిని సడెన్ గా చూస్తే ఏంటి చిరిగిన జీన్స్ వేసుకుంది అని అనిపించక మానదు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా అదే అంటున్నారు. ఏంటి పూజా .. అది జీన్సా అని కొందరు.. చిరిగింది.. చూసుకో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ డ్రెస్ లో పూజా పిచ్చ హాట్ గా ఉందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version