Site icon NTV Telugu

బుట్టబొమ్మను టాలీవుడ్ దూరం పెడుతుందట..?

pooja hegde

pooja hegde

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను పూజా హవా సాగుతూనే వస్తుంది. దీంతో ఒక్కసారిగా అమ్మడి పారితోషికం ఆమాంతం పెంచేసింది. ప్రస్తుతం అమ్మడు అన్ని సినిమా షూటింగ్లను పూర్తి చేసి ఖాళీగా ఉంది. ఆ సమయాన్ని అంత ఫ్యామిలీతో గడపడానికి వినియోగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం పెద్ద కష్టమేమి కాదు. కానీ , అమ్మడి పారితోషికం తలుచుకొని నిర్మాతలు దండం పెడుతున్నారట.

ఒక్కో సినిమాకు పూజా రూ.3-4 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేస్తోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో పూజాఐ నిర్మాతలు పక్కన పెడుతున్నారట. అమ్మడి గోల్డెన్ లెగ్ అని తెలిసినా అంత ముట్టజెప్పుకోలేక మేకర్స్ పక్కకి పోతున్నారంట. టాలీవుడ్ ఏఈ విషయంలో పూజను దూరం పెడుతోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇందులో కూడా నిజం లేకపోలేదు అని మరికొందరు నొక్కివక్కాణిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అంత రెమ్యూనిరేషన్ హీరో, హీరోయినలకు ఇచ్చి, హై బడ్జెట్ తో సినిమాలు తీసే స్తోమత తమనుకు లేదని పలువురు నిర్మాతలు బాహాటంగానే చెప్తున్నారట. మరి తన రెమ్యూనిరేషన్ విషయంలో పూజా తగ్గుతుందా..? లేక తన సినిమాలు విడుదలై హిట్ అందుకొని మళ్లీ అవకాశం వచ్చేవరకు ఎదురుచూస్తుందా..? అనేది చూడాలి

Exit mobile version