Pooja Hegde: సామజవరగమనా.. నిను చూసి ఆగగలమా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు ఎందరో రసిక శిఖామణులు. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు. అదీ – పూజా అందంలోని బంధం వేసే మహత్తు!
పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ముంబైలోని ఎమ్.ఎమ్.కె. కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే పలు భాషల్లో పట్టు సాధించడమే కాదు, ఫ్యాషన్ షోస్ లో పాల్గొని అలరించింది. అలా అలా పూజా హెగ్డే పేరు గ్లామర్ మార్కెట్ లో మారు మోగింది. తమిళ దర్శకుడు మిస్కిన్ తన ‘ముగమూడి’ చిత్రంలో పూజాను నాయికగా ఎంచుకున్నారు. జీవా హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి తెరపై తళుక్కుమంది పూజా హెగ్డే. తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’తో తెలుగునాట అడుగుపెట్టింది.
Also Read
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ఆపై ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది. ఈ మూడు చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆమె తొలి చిత్రం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహెంజో దారో’. అదికూడా అలరించలేదు. దాంతో పూజా హెగ్డే పాదంపై చిత్రసీమలో పలు అనుమానాలు రేకెత్తాయి. అల్లు అర్జున్ సరసన నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లో పూజా హెగ్డే అందం చిందులు వేసింది. ఆమెను చూడటానికే అన్నట్టు సినిమాకు జనం పరుగులు తీశారు. ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ చూసింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో “జిల్ జిల్ జిగేలు రాణి…”గా కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.
Read Also:Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ విడాకులు..?
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’లో మెరిసింది. మళ్ళీ మామూలే అన్నట్టుగా సాగింది పూజా చిత్ర ప్రయాణం. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’లో అరవిందగా ఆకట్టుకుంది. ‘మహర్షి’లో మహేశ్ బాబు సరసన మురిపించింది. ‘గద్దలకొండ గణేశ్’లో మరో శ్రీదేవి అనిపించింది. ఇక అల్లు అర్జున్ తో రెండో సారి నటించిన ‘అల వైకుంఠపురములో..’తో బంపర్ హిట్ ను తన బ్యాగ్ లో వేసుకుంది.
అప్పటి దాకా పూజా హెగ్డే చిత్ర ప్రయాణం ఓ తీరున సాగితే, ‘అల..వైకుంఠపురములో’ తరువాత మరో తీరున సాగింది అని చెప్పాలి. ఆ చిత్రం తరువాత పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అక్కినేని అఖిల్ కు ఓ సక్సెస్ దరి చేరేలా చేసింది. ఇక ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా నటించింది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లోనూ పూజా అందం కనువిందు చేసింది, కానీ, కనకవర్షం కురిపించలేకపోయింది.
తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’లో మురిపించింది. రణవీర్ సింగ్ తో జోడీ కట్టి ‘సర్కస్’ చూపించనుంది. సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ నటించింది. చిత్రమేమిటంటే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు జనం ముందుకు రానున్నాయి. డిసెంబర్ 23న ‘సర్కస్’ ప్రేక్షకులను పలకరించనుండగా, అదే నెల 30న సల్మాన్ చిత్రం ఆడియెన్స్ ను అలరించే ప్రయత్నం చేయనుంది. మహేశ్ బాబు సరసన మరోమారు నటించబోతోంది పూజ. ఈ యేడాది విడుదల కానున్న పూజా రెండు హిందీ చిత్రాలలో ఏది అలరించినా, ఆమె బాలీవుడ్ లోనూ ఓ హిట్టు పట్టేసినట్టే అవుతుంది. మరి పూజా అందం ఉత్తరాదిన ఎలాంటి బంధాలు వేస్తుందో చూద్దాం.
Read ALso: Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!