Site icon NTV Telugu

Ponniyin Selvan: ఏంటీ.. మూడురోజుల్లో రూ.200 కోట్లు సాధించిందా..?

Ps 1

Ps 1

Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకొంది. కొంతమంది సినిమాను అస్సలు బాగాలేదు అంటుంటే.. మరికొంతమంది పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఇది తమిళ్ తంబీలు మాత్రం సూపర్ హిట్ అని, పెద్ద కళాఖండం అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం కష్టపడిన తీరు కనిపిస్తున్నా మణిరత్నం స్టైల్ అయితే లేదని చెప్పుకొస్తున్నారు. చిన్న చిన్న పాత్రలకు కూడా భారీ తారాగణాన్ని తీసుకొని తప్పు చేసారని మరికొందరు భావిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం ఏంటంటే.. ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టడం.. ఏంటి నిజమా అంటే.. అవును ఈ మార్క్ ను అందుకున్నదని మేకర్స్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు సాధించిందని చెప్పుకొచ్చారు. ఇక చెప్పాలంటే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ.25.86కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5.93కోట్లు, కర్ణాటకలో రూ.5కోట్లు, కేరళలో రూ.3.7కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35కోట్లకు పైగా ఉన్నాయి. ఆ తరువాత వీకెండ్ రావడం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ రెండు రోజులు ఈ సినిమా బాగానే రాబట్టింది చెప్పుకొస్తున్నారు. ఇక మరోపక్క సినిమా కథను తెలుసుకోవడానికి కన్నా విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిమానులు వారిని చూడడానికి సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని రూ.200 కోట్లు రాబట్టిందంటే నోర్లు వెళ్లబెడుతున్నారు నెటిజన్లు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Exit mobile version