Mani Ratnam: త్వరలో ‘పొన్నియన్ సెల్వన్’ అప్ డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పీయస్-1’ని ప్రపంచవ్యాప్తంగా తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950 ల్లో వచ్చిన తమిళ నవల ‘కల్కి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
పదో శతాబ్దానికి చెందిన సాహసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్’. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారం ఇది. తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్ సెల్వన్ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపబోతున్నారు. శత్రువుల కోసం పనిచేసిన అస్మదీయుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఆస్కార్ విజేత ఎ. ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు తెలిపాయి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
Look out! Brace yourself.
Get ready for an adventure filled week!
The Cholas are coming! #PS1 🗡 @LycaProductions #ManiRatnam pic.twitter.com/uLYPJ4Z0LC— Madras Talkies (@MadrasTalkies_) July 2, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!