NTV Telugu Site icon

Nithiin: రాజకీయాల్లోకి హీరో నితిన్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ.. ?

Nithin

Nithin

Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే. ఎన్నికలు దగ్గరపడుతుండం, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా అస్సలు లేకపోవడంతో బీజేపీ నేతలు.. స్టార్ హీరోలను తమ ప్రచారాలకు రమ్మని పిలవడానికి ఈ భేటీలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే నితిన్.. సున్నితంగా బీజేపీకి ప్రచారం చేయడానికి ఇష్టం లేదని చెప్పుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే నితిన్ బీజేపీ కి కాకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడని సమాచారం. అయితే నితిన్ రాజకీయాల్లోకి రావడం వాస్తవమే కానీ, ఆయన పోటీ చేయకుండా.. ఆయన మేనమామ నగేష్ రెడ్డిని నిలబెట్టనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Eesha Rebba: ఎవరి కోసం పాప.. గుమ్మం ముందు అంతలా ఎదురుచూస్తున్నావ్

నగేష్ ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆయన రేవంత్ రెడ్డి తో భేటీ కూడా అయ్యారట. నితిన్ వాళ్ళ సొంత ఊరు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచే నగేష్ ను పోటీ చేయించాలని నితిన్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ విషయమై రేవంత్ రెడ్డితో నగేష్ చర్చలు జరుపగా.. సర్వేలను బట్టే టికెట్ ఇస్తారని రేవంత్ చెప్పినట్లు సమాచారం. దీంతో నగేష్ కోసం నితిన్ రంగంలోకి దిగినట్లు టాక్. ఆ టికెట్ కోసం నితిన్ చాలా కష్టపడుతున్నాడట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక నితిన్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.