కమెడియన్ సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా 2021 లో నేరుగా ఓటీటీ లో విడుదల అయి సూపర్ సక్సెస్ సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీ కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమా లో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ మరియు రాఖేందు మౌళి కీలకపాత్రలు పోషించారు.పొలిమేర-2 సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించడం తో పాటు కథ, స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమా ను గౌర్ కృష్ణ నిర్మించగా,గ్యానీ సంగీతం అందించారు.కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ ఏడాది నవంబర్ 3 వ తేదీన థియేటర్ల లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.. చిన్న సినిమా గా విడుదల అయిన పొలిమేర 2 మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది.త్వరలోనే పొలిమేర 3 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు పొలిమేర 2 మూవీ లో లీడ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ‘మా ఊరి పొలిమేర 2′ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.’మా ఊరి పొలిమేర-2’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ అధికారికం గా వెల్లడించింది. ” రా ఇటుగా రా పిడుగులా మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్ పొలిమేర 2 వచ్చేస్తుంది.ఊహించని ట్విస్టుల తో బ్లాక్‍బాస్టర్ పొలిమేర 2 ఆహాలో డిసెంబర్ 8న వచ్చేస్తోంది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది” ఆహా ట్వీట్ చేసింది.