Police Case Filed on Singer Chinmayi Sripada: ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి డబ్బింగ్ చెబుతూ ఫేమస్ అయిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. తనను తాను ఫెమినిస్టుగా చెప్పుకునే ఆమె ఎప్పటికప్పుడు ఆడవారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమె చేసిన ఒక వీడియోకి గాను ఆమె మీద కేసు నమోదు అయింది. సింగర్ చిన్మయి శ్రీపాద మీద హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. హెచ్సీయు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా చిన్మయి భారతదేశాన్ని స్టుపిడ్ కంట్రీ అంటూ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు సాగర్.
Director Krish: క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడు.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు?
భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం బ్యాడ్ కర్మ అంటూ ఇన్స్టాగ్రామ్ లో చిన్మయి వీడియో పోస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితం సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడవారి వస్త్రధారణ బాగుండాలి అంటూ పలు కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంగా చిన్మయి శ్రీపాద ఒక వీడియో చేసింది. ఆ వీడియోలోనే దేశాన్ని కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడిన నేపథ్యంలో చిన్మయి మీద కేసు నమోదు చేయాలంటూ హెచ్సీయు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశాడు. కుమార్ సాగర్ ఫిర్యాదును పరిశీలించిన గచ్చిబౌలి పోలీసులు చిన్మయి శ్రీపాద మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.