‘ఆర్ఆర్ఆర్’కు మరో కష్టం… విడుదల ఆపాలంటూ కోర్టులో పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్‌లను అవమానించేలా, వారి అనుచరుల మనోభావాలను దెబ్బతీసేలా… సినిమాలో ఉద్దేశపూర్వకంగా నిజమైన వీరుల చరిత్రను మూవీ టీం వక్రీకరించిందని పిటిషనర్ ఆరోపించారు.
Read also : అఫిషియల్ : “అఖండ” ఓటిటి కోసం అప్పటిదాకా ఆగాల్సిందే…!
Also Read
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ విచారణ కోసం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ వ్యాజ్యం ప్రజాహిత వ్యాజ్యం కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి ఎప్పటి నుంచో ఈ సినిమా కల్పిత కథ మాత్రమేనని, వారి నిజం జీవితంతో దీనికి సంబంధం లేదని చెప్తూనే ఉన్నాడు. ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా మూడో వేవ్ ముదురుతున్న కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేస్తూ పిల్ దాఖలు చేయడం గమనార్హం. మరి ఈ అంశంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!