అఫిషియల్ : “అఖండ” ఓటిటి కోసం అప్పటిదాకా ఆగాల్సిందే…!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గానూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఓటిటి ప్రీమియర్ కు ‘అఖండ’ సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21వ తేదీ నుండి బాలయ్య ‘అఖండ’ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు జనవరి 14వ తేదీన డిస్నీలో అఖండ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటిటి విడుదల ప్లాన్ మారిపోయింది. ఈ విషయాన్ని డిస్నీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

Read Also : “పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!

“21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. అయితే తాజా బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ కంటే రెండే వారాలు ముందుగా విడుదలైన ఈ సినిమా… దానికంటే రెండు వారాలు లేట్ గా ఓటిటిలో ప్రసారం కావడం గమనార్హం. ఇక ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు ఇది తెలుగు ఓటిటి ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles