Pekamedalu Teaser:బాహుబలి 2 లో సేనాపతిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్.. హీరోగా మారి ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశాడు. సైలెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రాకేష్.. హీరోగా కాకుండా నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం పేకమేడలు. కే తమిళ్ నటుడు వినోద్ కిషన్ ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పేకమేడలు. ఈ సినిమాలో వినోద్ సరసన అనూష కృష్ణ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి.. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే మిడిల్ క్లాస్ యువకుడు కథనే పేకమేడలు అని తెలుస్తోంది. టీజర్ మొత్తం లక్ష్మణ్ క్యారెక్టర్ ఎలాంటిది అని చూపించారు.
Thaman: అందరి ముందు.. తేజ్ గాడు పరువు తీసేశాడుగా..
ఒక మధ్యతరగతి యువకుడు లక్ష్మణ్.. రిచ్ గా బతకాలనుకుంటాడు. దానికోసం ఎంత రిస్క్ చేయడానికి అయినా వెనుకాడడు. అబద్దాలు చెప్పి, మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు. సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేకాటలో పొగుడుతూ ఉంటాడు అతను నివసించే గల్లీలో ఉన్నవారు అందరు అతనిని లక్ష్మణ్ కాదు లత్కోర్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. అసలు లక్ష్మణ్ చేసిన తప్పు ఏంటి.. ? చివరికి దాన్ని నుంచి బయటపడతాడా.. ? లక్ష్మణ్ కట్టిన పేకమేడలు కూలిపోతాయా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా వినోద్ నటన చాలా నేచురల్ గా ఉంది. ఇక టీజర్ లో ఎదగడానికి ఏం చేసిన తప్పు లేదు అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకొంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో రాకేష్ వర్రే నిర్మాతగా హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.