Thaman: అందరి ముందు.. తేజ్ గాడు పరువు తీసేశాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS.Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా స్నేహితులను చూస్తూనే ఉంటాం. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుర్తొచ్చేస్తాడు. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. నిత్యం వీరిద్దరూ ఎక్కడో ఒక చోట వీరి గ్యాంగ్ తో ఛిల్ల్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. థమన్ కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరి బాండింగ్ ఎంతలా ఉంటుంది అంటే.. ఒకరి మీద ఒకరు సెటైర్ లు వేసుకునేలా. తాజాగా స్టేజిమీద థమన్ పరువు తీసేశాడు తేజ్. గతరాత్రి బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్, తేజ్ పాల్గొన్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో తేజ్ హీరోగా నటించగా.. థమన్ సంగీతం అందించాడు.
Jailer: తలైవా ముందు ఎవ్వడైనా ‘జూజూబీ’ యేరా..
Also Read
ఇక ఈ ఈవెంట్ లో థమన్ లైవ్ బ్యాండ్ చేస్తూ.. తేజ్ ను స్టేజి మీదకు పిలవడంతో అక్కడకు వచ్చిన తేజ్.. ఒక్కసారిగా మైక్ తీసుకొని.. వీడు నా ఫ్యాన్ కాదు.. నా ఫ్రెండ్ అని చెప్పాడు. దీంతో స్టేజి అంతా నవ్వులు విరిశాయి. అదేంటి.. అంత మాట అన్నాడు. అసలు తేజ్ చెప్పినదానికి అర్ధం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా.. ఒక వీడియో బయటపడింది. అందులో థమన్.. తాను మ్యూజిక్ అందించిన ప్రతి హీరో సినిమా ఈవెంట్ లో ఈ హీరోకే తనకు ఫ్యాన్ అని చెప్పుకు రావడం కనిపించింది. ఇక ఆ వీడియో ఎప్పటి నుంచో ట్రోల్ అవుతుంది. ఇక తేజ్ ఈ విధంగా చెప్పాడు అంటే.. ఆయన కూడా ఆ ట్రోల్ వీడియోను చూసి ఉంటాడని, అందుకే ఫ్రెండ్ పై సెటైర్ వేశాడని చెప్పుకొస్తున్నారు. ఇక ఛీ.. ఛీ అందరి ముందు తేజ్ గాడు పరువు తీసేశాడుగా.. అని థమన్ బాధపడుతున్నట్లు మీమ్స్ వేస్తూ నెట్టింట అభిమానులు నవ్వుకుంటున్నారు.
🤣🤣🤣 https://t.co/BO2DgvWk2S pic.twitter.com/rhi7g7vK5g
— ʌınɐʎ (@CoolestVinaay) July 25, 2023
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!