Peddi: ‘నాకు, చరణ్‌కు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది..’ పెద్ది మూవీపై దివ్యేందు శర్మ సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi : ఒక సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగాలంటే ఒక్క టీజర్ చాలు… కానీ కొన్ని సార్లు ఒక నటుడు చేసిన ఒక కామెంట్ కూడా అంచనాలను ఆకాశానికెత్తేస్తుంది. ఇప్పుడు అదే పని చేసింది ‘మిర్జాపూర్’ ఫేమ్ నటుడు దివ్యేందు శర్మ చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ హైప్ నెలకొన్న వేళ… ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో దివ్యేందు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అనే అంచనాలు మాత్రమే ఉండగా… ఇప్పుడు ఇది అంతకంటే ఎక్కువ ఎమోషనల్ లేయర్లు కలిగిన కథ అని ఆయన రివీల్ చేయడంతో ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ ‘పెద్ది’ కేవలం క్రీడల నేపథ్యంలో నడిచే సినిమా మాత్రమే కాదని… ఇందులో చాలా బలమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని వెల్లడించాడు. ముఖ్యంగా జాహ్నవి కపూర్, రామ్ చరణ్ మధ్య సాగే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పిన ఆయన… వెంటనే మరో సెన్సేషనల్ ట్విస్ట్ ఇచ్చాడు. “రామ్ చరణ్‌కు, నాకు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది… కానీ అది చాలా టాక్సిక్” అంటూ నవ్వుతూ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అది నిజమైన ప్రేమకథ కాదా… లేక ఇద్దరి పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ను ఆయన ఆ విధంగా చెప్పాడా అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పెరిగిపోయింది.
Also Read
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలో తన పాత్ర గురించి కూడా దివ్యేందు ఆసక్తికర హింట్ ఇచ్చాడు. రామ్ చరణ్ పాత్రను ఢీకొట్టే పవర్ఫుల్ రైవల్ లేదా విలన్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు ఆయన చెప్పకనే చెప్పాడు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో మున్నా భయ్యా పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు… ఇంటెన్స్, అన్‌ప్రెడిక్టబుల్ క్యారెక్టర్లలో ఎంత బలంగా నటించగలడో ఇప్పటికే నిరూపించాడు. ఇప్పుడు అదే ఎనర్జీని ‘పెద్ది’లో కూడా చూపించబోతున్నాడనే సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ నుంచి అభిమానులు మరో కొత్త తరహా పాత్రను ఆశిస్తున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ తొలిసారి ఇంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగమవుతుండటంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పుడు దివ్యేందు వ్యాఖ్యలతో సినిమా కథపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ముఖ్యంగా “టాక్సిక్ లవ్ స్టోరీ” అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
స్పోర్ట్స్ డ్రామా, ఎమోషనల్ రిలేషన్షిప్స్, రైవల్రీ, ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్… ఇవన్నీ కలిపి ‘పెద్ది’ని సాధారణ కమర్షియల్ సినిమాగా కాకుండా ఒక బలమైన ఎమోషనల్ డ్రామాలా మలుస్తున్నాయని ఇప్పుడు సినీ వర్గాలు చర్చిస్తున్నాయి. అధికారికంగా కథపై ఇంకా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా… దివ్యేందు శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సినిమా చుట్టూ ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!