Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొంత కాలంగా రాజుకుంటున్న థియేటర్ల రెంట్స్, పర్సెంటేజీల వివాదం మరింత ముదిరింది. సమస్యను కొలిక్కి తెచ్చేందుకు నేడు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మరియు ఎగ్జిబిటర్లు మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఎటువంటి ఏకాభిప్రాయం రాకపోగా.. మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు.
ముఖ్యంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమా ప్రదర్శన విషయంలో తమకు ఖచ్చితంగా పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుబడుతున్నారు. నిర్మాతలు పర్సంటేజ్ కాస్త తక్కువ ఇచ్చినా తాము సర్దుకుపోతామని, కానీ అసలు పర్సెంటేజ్ విధానమే లేకుండా రెంట్ మాత్రమే ఇస్తామంటే మాత్రం కుదరదని ఎగ్జిబిటర్లు తెల్చిచెప్పినట్లు సమాచారం.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఈ క్రమంలో దిగివచ్చిన నిర్మాతలు ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు తాము సిద్ధమేనని నిర్మాతలు ఆఫర్ చేశారు. అయితే, ఇక్కడే ఎగ్జిబిటర్లు మరో మెలిక పెట్టారు. కేవలం ఈ ఒక్క సినిమాకు పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, భవిష్యత్తులో రాబోయే తదుపరి చిత్రాలకు కూడా పర్సంటేజ్ విధానం ఎలా ఉండబోతుంది? ఎంత ఇస్తారు? అనే విషయాలను వివరిస్తూ ‘పెద్ది’ సినిమా రిలీజ్‌కు ముందే తమకు రాతపూర్వకంగా (లెటర్) హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అంతర్గతంగా చర్చించుకుని, తమ తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎవరికి వారు పట్టు సడలించకపోవడంతో నేటి మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. నిర్మాతలు రేపు చెప్పబోయే నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది. రేపటితో ఈ వివాదానికి ఒక స్పష్టమైన ముగింపు వస్తుందని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!