Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలోకి వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత కూడా ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడును ఏమాత్రం తగ్గించకుండా కొనసాగిస్తోంది. సాధారణంగా భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు మొదటి వారం తర్వాత వేగం తగ్గడం సహజం. అయితే ‘పెద్ది’ మాత్రం రెండో వారాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ మరోసారి తన స్టామినాను నిరూపిస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ అంతా ‘పెద్ది’ వసూళ్ల గురించే సాగుతోంది. బుక్‌మైషోలో ఈ చిత్రానికి బుకింగ్‌లు మళ్లీ పెరగడం, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ఆశాజనకంగా ఉండటం సినిమా రన్ ఇంకా బలంగా కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత నుంచి వస్తున్న ఆదరణ రెండో వారంలో కూడా తగ్గకపోవడం చిత్రబృందానికి పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన దక్షిణాది చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘పెద్ది’ కొత్త రికార్డును నమోదు చేసింది. అగ్రస్థానంలో ఉన్న ‘కరుప్పు’ వసూళ్లను అధిగమించిన ఈ చిత్రం ఇప్పుడు మరో మైలురాయి వైపు దూసుకెళ్తోంది. తాజా లెక్కల ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.366 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఈ వారాంతం ముగిసే సమయానికి రూ.400 కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా ‘పెద్ది’ నిలవడం దాదాపు ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోగా, జాన్వీ కపూర్ పాత్ర కూడా మంచి స్పందనను అందుకుంది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కూడా కథకు మరింత బలం చేకూర్చారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద విజయగాథను రాస్తున్న ‘పెద్ది’కి రెండో వారాంతం కూడా కీలకంగా మారింది. ఇదే జోరు కొనసాగితే రూ.400 కోట్ల క్లబ్లో చేరడం మాత్రమే కాదు, మరిన్ని రికార్డులను కూడా ఈ చిత్రం తన ఖాతాలో వేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రేక్షకుల ఆదరణ, బలమైన మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతుతో ‘పెద్ది’ విజయ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?