Site icon NTV Telugu

Payal Rohatgi: అవును.. అవకాశాల కోసం చేతబడి చేయించా.. ప్రియుడిపై కూడా

Payal Rohatgi

Payal Rohatgi

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాకప్’. ఈ షో మొదలైనప్పటినుంచి ప్రేక్షకులను కంటెస్టెంట్లు ఎలాంటి సీక్రెట్లను బయటపెట్టనున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారం వారం ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలో జరిగిన దారుణాలను బయటపెడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్‌ పాయల్‌ రోహత్గి ఎవరూ ఊహించలేని ఒక సీక్రెట్ ని భయపెట్టింది. అది విన్న కంటెస్టెంట్ లతో పాటు కంగనా కూడా షాక్ అవ్వడంఆశ్చర్యం. ఇంతకీ పాయల్ చెప్పిన ఆ నిగూఢ రహస్యం ఏంటంటే.. చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఆమె చేతబడి చేయించిందట.

” నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది. మొదట అవకాశాలు వచ్చి కెరీర్ బాగానే నడిచినా ఆ తరువాత అవకాశాలు లేక కెరీర్ డల్ అయిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి తోచలేదు;. ఎలాగైనా అవకాశాలు రాబట్టాలని చూసాను. దానికోసం ఏం చేయాలన్న చేద్దామనుకున్నాను. మీరు నమ్ముతారో లేదో అవకాశాల కోసం నేను చేతబడి కూడా చేయించాను. నా కెరీర్ వేగంగా పుంజుకోవాలని చెప్పి ఢిల్లీలోనే ఒక పూజారి సహాయంతో చేతబడిలోని వశీకరణ విద్యను నేర్చుకొని.. చాలామంది వద్ద ప్రయోగించాను. అయితే ఆ చేతబడి వలన పెద్దగా నాకు ప్రయోజనం ఏమి కలగలేదు. అవకాశాలు వాటంతట ఏవ్ వచ్చేవి.. పోయేవి.. సాధారణంగా ఇలాంటి విషయాలను ఎవరు బయటపెట్టరు.. గుట్టుగా దాచుకుంటారు. ఇలాంటి విద్యలను చాలామంది నమ్మరు.. ఒకవేళ నమ్మి చేసినా ఎంతో రహస్యంగా ఉంచుతారు.. ఎందుకంటే ఇలాంటివి బయటపడితే చులకన అయిపోయితామని చెప్పరు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అమ్మడి మాటలకు ఖంగుతిన్న కంగనా కొద్దిసేపటికి నవ్వి, ” నీకు అందం, టాలెంట్ ఉంది.. అలాంటప్పుడు వశీకరణలను నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది.. నేను కెరీర్ మొదట్లో హిట్ అందుకోగానే చేతబడి చేయించాను అని ఆరోపించారు.. ఒక అమ్మాయి విజయాన్ని అందుకుంటే ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే.. అయితే నువ్వు నిజం చెప్పావ్ .. అది నీ దైర్యం అంటూ మెచ్చుకుంది. అంతేకాకుండా నీ ప్రియుడిపై కూడా చేతబడి చేయించావా..? అతడు ఈ మాటలను వింటే ఏమనుకుంటాడు అని అడగగా.. నన్ను అతడు ఎలా నమ్ముతాడో దాని అతడికే వదిలేస్తున్నా.. కానీ నా ప్రియుడిపై మాత్రం చేతబడి చేయలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version