Payal Ghosh Comments on Nandamuri Balakrishna goes Viral: ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించి బెంగాలీ భామ, హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైనా ఆ తరువాత నటనకే దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్లతో విరుచుకుపడే పాయల్ తాజాగా హిందీ నటులను టార్గెట్ చేసింది. ఈసారి మన తెలుగు హీరో బాలకృష్ణను పొగుడుతూ, బాలీవుడ్ యాక్టర్స్ ఆయనను చూసి నేర్చుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
Kamakshi Bhaskarla : ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ..?
అన్ స్టాపబుల్ షోతో పాటు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. 63 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, నేటి తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో అదే విషయాన్ని పాయల్ ఘోష్ తన తాజా ట్వీట్ లో ప్రస్తావిస్తూ, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ బాలయ్యని చూసి నేర్చుకోవాలని సూచించింది. బాలకృష్ణ సార్ ఈ ఏజ్ లో కూడా సూపర్ హిట్స్ కొడుతున్నారు, బాలీవుడ్ నటులు ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలని పాయల్ ఘోష్ శనివారం ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ క్రమంలో ఆమె బాలయ్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. పాయల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కకపోవడంతో అమ్మడు బాలీవుడ్ కి వెళ్లినా అక్కడ కూడా ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు.
Bala krishna Sir even in this age giving super hits… Bollywood actors should learn from them 💕 pic.twitter.com/OyjDLFJ1yo
— Payal Ghoshॐ (@iampayalghosh) November 4, 2023