పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు సినిమాపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రత్యేక కథనం ఒకటి బయటకు వచ్చింది.
Also Read : Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చిత్తూరు జిల్లా రాఘవ్ థియేటర్‌లో ఒక అభిమాని ‘ఓజీ’ తొలి టికెట్‌ను అక్షరాల లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ డబ్బును పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపి, గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మంచి పనికి సినీ వర్గాలు, అభిమానులు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ అభిమాని శ్రీరామ్ లోచన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ఇక ‘ఓజీ’ విడుదల సందర్భంగా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే టికెట్ ధరలు, ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్‌కి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచే అవకాశం కల్పించింది. సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ పవర్‌ఫుల్ లుక్‌తో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘ఓజీ’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
OG సినిమా ఫస్ట్ టికెట్టును లక్ష రూపాయలకు కొన్న పవన్ ఫ్యాన్#OG #PawanKalyan #OGTicket #NTVTelugu pic.twitter.com/F55YBJFTut
— NTV Telugu (@NtvTeluguLive) September 20, 2025