పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ కు చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ ఇచ్చింది ఈ మూవీ. ఇందులో పవన్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లు వసూలు చేసింది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. ఫ్యాన్స్ అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Read Also : Peddi : రామ్ చరణ్ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?
అయితే తాజాగా మెగా హీరోలు ఈ సినిమాను చూశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ గా వేసిన షోకు పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా, ఆద్య, చిరంజీవి మనవరాళ్లు వచ్చారు. వీరితో పాటు అడవిశేష్, రాహుల్ రవీంద్రన్ , సుజీత్, థమన్ కూడా వీరితో పాటు ఉన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే సారి సినిమా చూడటం చాలా అరుదు. ఇప్పుడు ఓజీతో అది కుదిరింది.
Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్