Arjun Das : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజై భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. టాలీవుడ్ లోనే టాప్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గురించే చర్చ జరుగుతోంది. అతని వాయిస్ కు అంతా ఫిదా అవుతున్నారు. కానీ అదే వాయిస్ తో తాను అవమానాలు పడ్డానని గతంలో అర్జున్ దాస్ తెలిపాడు. చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ దాస్.. కాలేజీ రోజుల్లోనే తన బేస్ వాయిస్ ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చదువుకుని దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. అక్కడే ఐదంకెల జీతంతో హాయిగా గడిపాడు. కానీ అతనికి సినిమాల్లోకి రావాలని ఆశ ఉండేది.
Read Also : Review : 3 BHK
దాని కోసం 18 కిలోల బరువు తగ్గి సినిమాల్లోకి వచ్చాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వాయిస్ ను చూసి చాలా మంది అవమానించారంట. తన వాయిస్ బాలేదని అవకాశాలు కూడా ఇవ్వలేదంట. అలా చాలా అవకాశాలు మిస్ చేసుకున్న తర్వాత చివరకు 2012లో విడుదలైన ‘పేరుమాన్’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ అందుకోవడానికి తొమ్మిదేళ్లు పట్టింది ఈయనకు. రాను రాను తన బేస్ వాయిస్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. వరుసగా అవకాశాలు అందుకున్నాడు. లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. కానీ తన వాయిస్ కు సెపరేట్ గా ప్రశంసలు దక్కింది మాత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ తోనే అని చెప్పాడు. ట్రైలర్ కు తాను వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఇప్పుడు తన వాయిస్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారని.. ఎంతో మంది ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారని తెలిపాడు. ఇది తనకు నిజమైన సక్సెస్ లాగా ఉందన్నాడు.
Read Also : Prabhas : నటుడు ఫిష్ వెంకట్ కు ప్రభాస్ భారీ సాయం..
