Site icon NTV Telugu

రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న “భీమ్లా నాయక్”

Pawan Kalyan’s Bheemla Nayak creates nationwide records

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “భీమ్లా నాయక్” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” స్టార్మ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న “పవర్ స్టార్మ్” పేరుతో మేకర్స్ విడుదల చేసిన 24 గంటల్లో 10 మిలియన్ + వ్యూస్, 700కే ప్లస్ లైక్స్ వచ్చాయి. దేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన టీజర్ గా “భీమ్లా నాయక్” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిన్న విడుదలైన ‘పవర్ స్టార్మ్’ అంచనాలను మరింతగా పెంచింది. ఇప్పటికి ఈ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Read Also : లంకేశ్వరుడికి ప్రభాస్ బర్త్ డే విషెస్

ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీమేక్‌కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించనుంది. “వరల్డ్ ఫేమస్ లవర్”లో చివరిసారిగా నటించిన ఐశ్వర్య రాజేష్ రానా సరసన జతకట్టనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి రానాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Exit mobile version