పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OGపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన OG ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. భారీ హైప్.. భారీ బడ్జెట్ తో పాటు అంతే స్థాయి ఎక్స్పెక్టేసన్స్ తో వస్తున్న OG ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
మరోవైపు పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో భాదపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారని, ఆ జ్వరంతోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి. ఫీవర్ కారణంగా ఈ పవర్ స్టార్ నేడు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు పవర్ స్టార్ అభిమానులు OG సెలెబ్రేషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. థియేటర్స్ వద్ద జనసైనికుల హడావిడి మాములుగా లేదు. నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో హంగామా చేస్తున్నారు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా ఆంధ్ర నుండి అమెరికా వరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ OG సినిమా రిలీజ్ ను ఫెస్టివల్ గా నిర్వహిస్తూ తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.