Site icon NTV Telugu

Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత

Akira

Akira

Akira Nandan : పవన్ కల్యాన్‌ కొడుకు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం అకీరా నటనపై కోచింగ్ తీసుకుంటున్నాడని.. త్వరలోనే బడా నిర్మాత ఆ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. అలా పేరు ప్రచారం జరుగుతున్న వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్‌ నటించిన హరిమర వీరమల్లు సినిమాకు ఆయన సాయం చేశారు. అకీరా సినిమా కోసమే వీరమల్లుకు సాయం చేశారంటూ రూమర్లు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. తాను ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నానని.. దానిపై తప్ప వేరే సినిమా గురించి ఆలోచించట్లేదని తెలిపారు.

Read Also : Rahul Gandhi: ఓటర్ల జాబితా చూపించడానికి ఈసీకి ఇబ్బందేంటి?

అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అందరికీ ఉంటుంది. ఆ అవకాశం వస్తే నేను మూవీ చేయడానికి రెడీగానే ఉన్నాను. కానీ అకీరాతో సినిమా కోసం నేను వీరమల్లుకు సాయం చేయలేదు. ఆ టైమ్ లో ఏఎమ్ రత్నంకు నా సాయం ఉందనిపించింది. అందుకే చేశా. కానీ అకీరాతో మూవీ చేయాలనే కారణం లేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే కచ్చితంగా అకీరాతో సినిమా చేస్తా. అకీరా ఎవరితో సినిమా చేయాలనేది అతని ఇష్టం. నాకు ఛాన్స్ వస్తే పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్‌, చిరంజీవితో కూడా సినిమాలు చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు విశ్వ ప్రసాద్. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నడుమ అకీరా నందన్ సోషల్ మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాడు. అతని లుక్స్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి. దీంతో పవన్ కొడుకు ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Read Also : KA. Paul: ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారు.. భారత్‌ను బెదిరిస్తే ఊరుకోను

Exit mobile version