Site icon NTV Telugu

Major: ‘మేజర్’ పై పవన్ ప్రశంసలు.. ఉబ్బితబ్బి బైన అడివి శేష్

Pawan

Pawan

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైనప్పటినుంచి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ముంబై మారణ హోమంలో కమాండర్ ఉన్నికృష్ణన్ చేసిన సాహసాలను ఎంతో చక్కగా చూపించారని కొనియాడారు. నిజమైన హీరోల గురించి ప్రజలకు తెలియజేయడానికి టాలీవుడ్‌లో మరిన్ని ఒరిజినల్ సినిమాలు రావాలని, టైట్ షెడ్యూల్ వల్లే సినిమా చూడలేక పోయానని, త్వరలోనే సినిమాను వీక్షిస్తానని తెలిపారు. అంతేకాకుండా మేజర్ చిత్రంలో భాగమైనందుకు మహేష్ బాబు కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇక ఈ ట్వీట్ పై అడివి శేష్ స్పందించాడు. తన సినిమా గురించి పవన్ ఈ విధంగా ప్రశంసల వర్షం కురిపించినందుకు శేష్ ఉబ్బితబ్బిబైపోయాడు. “పవన్ కళ్యాణ్ గారు.. నా హృదయం నిండిపోయింది. మీరు టూర్ బిజీలో ఉండేసరికి మీకు మేజర్ చూసే టైమ్ ఉంటుందా..? అని అనుకున్నాను. కానీ మా సినిమా గురించి మీరు వ్యక్తిగతంగా ఈ నోట్ రాయడం నిజంగా మనసును హత్తుకుంటుంది. నాకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అన్నీ .. ఆరోజు పంజా.. ఈరోజు మేజర్.. నిజంగా మీ గ్రేస్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఫోన్ లో మాట్లాడడానికి వాటిని దాచుకుంటున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు సర్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version