Major: ‘మేజర్’ పై పవన్ ప్రశంసలు.. ఉబ్బితబ్బి బైన అడివి శేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైనప్పటినుంచి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ముంబై మారణ హోమంలో కమాండర్ ఉన్నికృష్ణన్ చేసిన సాహసాలను ఎంతో చక్కగా చూపించారని కొనియాడారు. నిజమైన హీరోల గురించి ప్రజలకు తెలియజేయడానికి టాలీవుడ్‌లో మరిన్ని ఒరిజినల్ సినిమాలు రావాలని, టైట్ షెడ్యూల్ వల్లే సినిమా చూడలేక పోయానని, త్వరలోనే సినిమాను వీక్షిస్తానని తెలిపారు. అంతేకాకుండా మేజర్ చిత్రంలో భాగమైనందుకు మహేష్ బాబు కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇక ఈ ట్వీట్ పై అడివి శేష్ స్పందించాడు. తన సినిమా గురించి పవన్ ఈ విధంగా ప్రశంసల వర్షం కురిపించినందుకు శేష్ ఉబ్బితబ్బిబైపోయాడు. “పవన్ కళ్యాణ్ గారు.. నా హృదయం నిండిపోయింది. మీరు టూర్ బిజీలో ఉండేసరికి మీకు మేజర్ చూసే టైమ్ ఉంటుందా..? అని అనుకున్నాను. కానీ మా సినిమా గురించి మీరు వ్యక్తిగతంగా ఈ నోట్ రాయడం నిజంగా మనసును హత్తుకుంటుంది. నాకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అన్నీ .. ఆరోజు పంజా.. ఈరోజు మేజర్.. నిజంగా మీ గ్రేస్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఫోన్ లో మాట్లాడడానికి వాటిని దాచుకుంటున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు సర్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
.@PawanKalyan Dear Powerstar. My heart is full❤️ Meeru tour busy unde sariki meeku #Major choose time untundha ani Anukunna. Your warm personal note is truly touching. #MajorSandeepUnnikrishnan is everything to me. Aa roju #Panjaa Ee roju #Major, truly thankful for your grace 1/2 pic.twitter.com/BSxibWYgzM
— Adivi Sesh (@AdiviSesh) June 12, 2022
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?