పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రో మూవీ మరింత బజ్ ని జనరేట్ చేసింది. అనౌన్స్మెంట్ సమయంలో అసలు అంచనాలు లేని ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ డే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి అంటే ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజ్ సౌండ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్ స్టఫ్ ని సినిమా మొత్తం లోడ్ చేసిన సముద్రఖని, ఫాన్స్ పై ఫైర్ చేయడానికి రెడీ అయ్యాడు.
Read Also: Kajal Agarwal : నెటిజెన్ అడిగిన ఆ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్..
లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ‘లెగ్’ లిఫ్ట్ చేసిన ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు సముద్రఖని. ఈ ఫోటోని చూడగానే జల్సా సినిమాలోని సంజయ్ సాహూ గుర్తొచ్చాడు అంటూ ఫాన్స్ నోస్టాల్జియా ఫీల్ అవుతున్నారు. ఈ ఫోటో అనే కాదు ప్రతి విషయంలో సముద్రఖని, వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా బ్రో సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. కాస్త పాజిటివ్ టాక్, కొంచెం పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్ అండ్ స్వాగ్ సినిమాలో కనిపిస్తే చాలు ‘బ్రో’ సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా.
Our #BRO in #BRO💪💪💪💪 pic.twitter.com/96mPF46okb
— P.samuthirakani (@thondankani) July 2, 2023