పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు పవన్ వైట్ కలర్ డ్రెస్ లో తప్ప నార్మల్ గా కనిపించడం తక్కువ. గుబురు గడ్డం, వైట్ డ్రెస్ తప్ప వేరే లుక్ లో కనిపించలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. బ్లాక కలర్ షర్ట్ , గ్రే కలర్ ప్యాంటు.. క్లీన్ షేవ్ తో అదరగొట్టేశాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
గత కొన్ని రోజులు వరకు పవన్ లైట్ గడ్డం లుక్ లో కనిపించి ఆసక్తి రేపగా ఇప్పుడు మళ్ళీ భీమ్లా లుక్ లోకి పవన్ మారిపోయారు. ఇంకా భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తికాలేదా అనేది ప్రస్తుతం అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. ఫిబ్రవరి 25 న రిలీజ్ పెట్టుకొని ఇంకా షూటింగ్ పూర్తి కాకపోతే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారని అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే జనసేనాని స్టైలిష్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
