ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా ట్రీట్ కోసం అభిమానులు గత కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు వారి నిరీక్షణకు తెర దించుతూ వరుస సర్ ప్రైజ్ లు మెగా అభిమానులను థ్రిల్ చేయబోతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వాటి రిలీజ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు.
Read Also : పవన్ కళ్యాణ్ పవర్!
ముందుగా రానా, పవన్ కళ్యాణ్ కాంబోలో క్రేజీ స్టార్ గా రూపొందుతున్న “భీమ్లా నాయక్” ఫస్ట్ సింగిల్ ఈ రోజు ఉదయం 11.16 గంటలకు వస్తుంది. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు” నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు అప్డేట్ రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పవన్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ మధ్యాహ్నం 2.20 వస్తుంది. ఇక చివరగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఒకే రోజు వరుస అప్డేట్ లతో పవన్ అభిమానులను ముంచెత్తబోతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ కు పండగే !
