Pawankalyan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ పాన్ ఇండియా కంటే ముందు టాలీవుడ్ ను ఏలింది పవన్ కల్యాణ్. అందులో నో డౌట్. అలాంటి పవన్ రెండు భారీ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన స్టార్ ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదేమో. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా. ఈ మూవీ ఓ సెన్సేషన్. ఈ సినిమాతోనే రవితేజ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. కానీ దీనికి ముందుగా రాజమౌళి పవన్ కల్యాణ్ ను హీరోగా అనుకున్నాడు. ఆ విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలిపాడు.
Read Also : Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?
ఓ సారి పవన్ కల్యాణ్ ను కలిసి ఈ మూవీ లైన్ చెప్పాడంట. మీకు ఎలాంటి సినిమా కావాలో అలాంటిదే చేద్దాం అని జక్కన్న అడిగాడంట. కానీ అప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. రాజమౌళి సినిమాకు భారీగా కాల్షీట్లు కేటాయించలేకపోయాడు. దాంతో రాజమౌళి అదే సినిమాను రవితేజతో చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
ఈ మూవీలో ఒకవేళ పవన్ చేస్తే మాత్రం ఆ మాస్ క్రేజ్ వేరే లెవల్ లో ఉండేదేమో. దెబ్బకు టాలీవుడ్ లో ఆయన మార్కెట్, ఫాలోయింగ్ డబుల్ అయ్యేది. ఈ సినిమా కంటే ముందు ఓ మంచి లవ్ స్టోరీని మిస్ చేసుకున్నాడు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్, అమీషా పటేల్ జంటగా చెప్పాలని ఉంది అనే సినిమాను స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేశారు. అదే కథతో తరుణ్ హీరోగా నువ్వే కావాలి అనే కొత్త టైటిల్ పెట్టి కె విజయ్ భాస్కర్ ఈ మూవీని తీశారు. అప్పట్లో ఇది యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో తరుణ్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇందులో పవన్ చేసి ఉంటే కెరీర్ కు మంచి ప్లస్ అయ్యేదేమో.
Read Also : Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
