Idiot : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాప్ టాక్ వచ్చిన పవన్ సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంటాయి. అలాంటి పవన్ ఎన్నో హిట్ సినిమాను వదులుకున్నారు. అందులో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అదేదో కాదు ఇడియట్ సినిమా. ఈ మూవీ రవితేజకు భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ పెద్ద హీరోగా మారిపోయాడు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను ముందుగా రవితేజతో చేద్దాం అనుకోలేదంట.
Read Also : Tamannaah : ఒక్క సాంగ్ కోసం తమన్నా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?
అప్పటికి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ తో తీస్తే బాగుంటుందని ఆలోచించాడు. కానీ పవన్ కల్యాణ్ కు అప్పటికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. పైగా ఇడియట్ లో హీరో పాత్ర బేవర్స్ గా ఉండటం వల్ల పవన్ కు కొంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. అందుకే తర్వాత చూద్దాం లే అని పూరీకి చెప్పాడంట. ఇక చేసేది లేక పూరీ అదే కథను పట్టుకుని రవితేజ వద్దకు వెళ్లగా ఓకే అయింది. ఇంకేముంది ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. భారీ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది. ఒకవేళ అదే మూవీ పవన్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేదోమ. యూత్ మొత్తం ఊగిపోయేది.
Read Also : OG : పవన్ కల్యాణ్ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..
