God Father: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేస్తున్నాయి. ఇక ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ మాములుగా లేదు.. చిరునే పెద్ద స్టార్ అంటే.. నయనతార, సత్యదేవ్.. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపారని తెలుస్తోంది. మళయాళంలో టోవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడట. సినిమా మొత్తానికి ఈ పాత్ర హైలైట్ గా నిలుస్తోంది. అమెరికా నుంచి వచ్చిన అసలైన వారసుడు అతనే. ఇక ఈ సినిమాకు హైలైట్ టోవినో పొలిటికల్ స్పీచ్.. తెలుగులో పవన్ కూడా అలాంటి అదిరిపోయే స్పీచ్ ఇవ్వనున్నాడట.
ఇక నిజం చెప్పాలంటే ఆ పాత్ర కోసమే చిరు ఈ సినిమాను టేకోవర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రసంగాలు ఎంత కలకలం సృష్టిస్తున్నాయి తెల్సిందే.. ఇక ఈ సినిమాలో పవన్ స్పీచ్ కూడా నిజ రాజకీయాలకు కౌంటర్లు ఇచ్చినట్టే ఉంటుందట. ఇక చివర్లో టోవినో, మోహన్ లాల్ అన్నదమ్ములిద్దరూ ఒక్కటే అని ఒక డైలాగ్ చెప్తాడు. ‘ఇదంతా నా అన్న చెప్తేనే చేశాను.. అన్న లేనిదే నేను లేను’అనే డైలాగ్ పవన్ థియేటర్లో చెప్తే అరాచకం అని అంటున్నారు. ఇక ఒరిజినల్ లో ఈ పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుంది.. దాన్ని తెలుగులో 20 నిమిషాలకు కుదించి పవన్ కు కేవలం మూడు షాట్లు కనిపించేలా మార్చరట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. సినిమా థియేటర్లు దద్దరిల్లినట్లే అంటున్నారు అభిమానులు. ఇదొక సర్ప్రైజ్ గా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ గాడ్ ఫాదర్ సెట్ లో మెరిసినప్పుడే ఈ షూటింగ్ జరిగిందని చెప్పుకొస్తున్నారు. ముందే ఈ విషయాన్ని బయటపెడితే ఆ సర్ప్రైజ్ ఉండదని, సినిమా చుస్తే అభిమానులకు ఆ థ్రిల్ వేరుంటుందని అనుకోని మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.