PSPK28 ప్రీ లుక్: కాస్త నిరాశపరిచిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటుంది. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని మాత్రమే ప్రకటించిన.. ఫ్యాన్స్ సంతృప్తిగానే ఉన్నారు.
ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా అప్డేట్ ఇచ్చారు. పవన్ పోస్టర్ లో లేకున్నా, టైటిల్ రాకున్నాను ఈ అప్డేట్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఈ పోస్టర్ లో ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్’ అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడంతో ఆసక్తికరంగా ఉంది. ఆ స్లోగన్ లోనే దమ్ము ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫైనల్ గా హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఇచ్చారు. కాగా, ఇది కాస్త ఫ్యాన్స్ ను నిరుత్సహపరిచింది.
Also Read
హరీష్ శంకర్ సినిమాలోని పవన్ ప్రీ లుక్ వచ్చిన.. ఇందులో పవన్ కళ్యాణ్ ను మొత్తంగా చూపించకుండా సగమే చూపించారు. ఆ సగం లుక్కుతోనే కొందరు హ్యాపీగానే వున్నా.. మరికొందరు మాత్రం.. ‘హరీష్ గారు, మీరు కూడా ఇలా సగం సగం చేస్తే ఎట్లా అండీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టర్ వెనకాల ఇండియా గేట్ ఉండటం చూస్తుంటే కథ ఢిల్లీలో జరిగేలా కనిపిస్తోంది. అంతేకాదు, ‘ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అంటూ పోస్టర్ లో కనిపించడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!