Site icon NTV Telugu

HHVM : ప్లాపుల్లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ మాత్రమే : పవన్

Pawan Kalyan Hhvm Event

Pawan Kalyan Hhvm Event

HHVM : పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై ఎమోషనల్ అయ్యారు. నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న టైమ్ లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన వాడే నిజమైన స్నేహితుడు. అప్పటి వరకు అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ మేమిద్దరం కలిసి జల్సా మూవీ చేశాం.

Read Also : Kajal Agarwal : జిమ్ లో చెమటలు చిందిస్తున్న కాజల్..

ఎవరైనా సక్సెస్ లో వెతుక్కుంటూ వస్తారు. అపజయాల్లో వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి స్నేహితుడిని భగవంతుడు నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపంలో ఇచ్చాడు. నాకు పెద్ద డైరెక్టర్లు లేరు. అందుకే నేను ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తున్నాను. కొత్త సినిమాలు చేసి ఒకవేళ ప్లాపులు అయితే నన్ను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి. నా పార్టీని నడపాలి. నా కుటుంబాన్ని పోషించాలి. నిర్మాతలను కాపాడుకోవాలి. దానికి డబ్బులు కావాలి. రీమేక్ లు చేస్తే ఎంతో కొంత డబ్బులు కచ్చితంగా వస్తాయని వాటిని చేశాను. ఈ మూవీ హిందువుగా జీవించాలంటే శిస్తు విధిస్తే తిరుగుబాటుకు దారి తీస్తుంది. ఇది అలాంటి మూవీ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌.

Read Also : Pawankalyan : ప్రతిసారి ఆ హీరోలతో పోల్చుకుంటున్న పవన్.. ఎందుకు..?

Exit mobile version