Site icon NTV Telugu

Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!

Pawan Kalyan Ustad Bhagath Singh

Pawan Kalyan Ustad Bhagath Singh

Pawankalyan : పవన్ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల సమయం నుంచి ఆగిపోయిన సినిమాలను మళ్లీ కంప్లీట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఓజీ సినిమాకు కంటిన్యూగా డేట్లు ఇచ్చేశారు. రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్‌ ఓజీ షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారంట పవన్ కల్యాణ్‌. జూన్ 12 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటారంట పవన్ కల్యాణ్‌.

Read Also : Jammu Kashmir: ‘‘లొంగిపోవాలని ఉగ్రవాదిని కోరిన తల్లి’’.. ఎన్‌కౌంటర్‌లో హతం..

28 రోజుల పాటు ఓజీ షూట్ లో పాల్గొన్న తర్వాత.. ఉస్తాద్ సినిమాను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇప్పటికే హరీశ్ శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ కోసం అన్నీ రెడీ చేశామని పవన్ కల్యాణ్‌ రావడమే ఆలస్యం అంటూ తెలిపారు. పవన్ ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తామని చెబుతున్నాడు హరీశ్ శంకర్. ఆయన చెప్పిన దాని ప్రకారం జూన్ నుంచి జులై ఎండింగ్ వరకు పవన్ కల్యాణ్‌ పై కీలక సీన్లు షూట్ చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఒప్పుకున్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. కొత్తవి ఇప్పట్లో పెట్టుకునేలా కనిపించట్లేదు.

Read Also : Nithin : తీవ్ర సమస్యల్లో ‘తమ్ముడు’.. విశ్వంభర వస్తే ఎలా..?

Exit mobile version