Site icon NTV Telugu

OG : అదే జరిగితే సుజీత్ కు బలమైన అండ దొరికినట్టే..

Sujeeth

Sujeeth

OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్‌ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు లాంటివి నిరాశపరిచాయి. ఇప్పుడు భారీ అంచనాలతో ఓజీ సినిమా వస్తోంది.

Read Also : OG : పవన్ కల్యాణ్‌, సుజీత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?

ఇది గనక మంచి హిట్ పడితే పవన్ ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో పవన్ ఎదురు చూస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు మంచి హిట్ పడితే పండగలా సెలబ్రేట్ చేయాలని చూస్తోంది. ఇప్పుడు సుజీత్ చేతిలో ఉంది. ఈ మూవీ గనక హిట్ అయితే కలెక్షన్ల ఊచకోత ఖాయం. అప్పుడు సుజీత్ కు టాలీవుడ్ లో బలమైన మెగా ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది. ఓజీ తర్వాత మెగా హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. అందులో నో డౌట్. మరి రేపు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Coolie : కూలీలో మంచి పాత్ర ఇవ్వలేదు.. లోకేష్ పై నటి షాకింగ్ కామెంట్స్

Exit mobile version