Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జనసేనాని అంటూ తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ కు పవన్ కల్యాణ్ రిప్లై ఇచ్చారు. అన్నయ్యపై తనకున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. తనకు తండ్రి సమానుడు అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
‘నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ చిరంజీవి అన్నయ్యకుమనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను. అంటూ రాసుకొచ్చాడు పవన్ కల్యాణ్. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు స్పెషల్ రిప్లై ఇచ్చాడు పవన్ కల్యాణ్.
Read Also : Pawan Kalyan Birthday Special : ఇండస్ట్రీలో అగ్ర హీరో.. ప్రజల్లో జనసేనాని.. పవన్ బర్త్ డే స్పెషల్..
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty… https://t.co/VYRpPj5ZKu
— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2025
