Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి. అయినా వీటిని పట్టించుకోకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాడు. అదే పవన్ ఫ్యాన్స్ కు మరింత నచ్చుతుంది. మిర్చి లో ఒక డైలాగ్ ఉంటుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అని.. ఇప్పుడు అదే నిజమైంది. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్.. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనేగా.. సాధారణంగా అభిమానులు.. హీరోల డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు. వాటిని ఫ్రేమ్స్ కట్టించి హీరోలకు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు.. ఇంకొంతమంది అభిమానులకు అమ్ముతూ ఉంటారు.
Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
మహా అయితే ఒక ఫ్రేమ్ ఎంత ఉంటుంది.. ఒక వెయ్యి.. రెండు వేలు.. పోనీ పది వేలు అనుకుందాం. కానీ, ఇక్కడ మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ డ్రాయింగ్ ఫొటో అక్షరాలా.. 520 డాలర్లు అంటే మన రూపాయల్లో 43,241 రూపాయలు. అవును ఇప్పటివరకు ఏ హీరో కక్రియేట్ చేయలేని రికార్డు ఇది. బ్రో సినిమాలో పవన్ లుక్ ను చేత్తో గీసిన ఈ ఆర్ట్ ను అమెరికాలో ఉంటున్న ఒక పవన్ అభిమాని 520 డాలర్లు పెట్టి కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అది రా పవన్ రేంజ్.. వేరే ఏ హీరోకు లేదు ఈ రికార్డ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఇంకోపక్క రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నాడు. మరి వచ్చే ఏడాది పవన్ రాజకీయాల్లో గెలుస్తాడో లేదో చూడాలి.