పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే బ్రో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అదిరిపోయాయి. పవర్ ఫుల్ స్టైలిష్ గాడ్‌గా కనిపించబోతున్నడు పవన్. అయితే ఈ సినిమా రిలీజ్‌కు మరో నెల రోజుల సమయమే ఉంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో.. బ్రో టీజర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ రిలీజ్ డేట్ ఏ క్షణంలో అయినా బయటకి రావొచ్చు, దాదాపు మరో రెండు రోజుల్లోనే బ్రో టీజర్ బయటకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒక్కసారి బ్రో టీజర్ బయటకి వచ్చేస్తే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అక్కడి నుంచి ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే చాలు బ్రో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో మెగా మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు మాస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ సాంగ్ లో పవన్ రైల్వే కూలి గెటప్ వేసుకోని మాసీ లుక్ లో కనిపిస్తాడు. ఇదే లుక్ ని ఇప్పుడు తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి రీక్రియేట్ చేసారు. థియేటర్స్ లో ఈ సీన్ మెగా ఫాన్స్ రచ్చ చెయ్యడం గ్యారెంటీ.
ON THE WAY #BRO pic.twitter.com/P4oGrho8lk
— P.samuthirakani (@thondankani) June 27, 2023