Site icon NTV Telugu

మలయాళ రీమేక్ కోసం మెగా కాంబో రెడీనా ?

Pawan Kalyan and Ram Charan team up for

టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరో క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే… పవన్, చరణ్ మల్టీస్టారర్. గత సంవత్సరం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సూపర్ హిట్ మలయాళ డ్రామా ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్‌లో స్క్రీన్ పంచుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. ఒకానొక సమయంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ క్రేజ్ రీమేక్‌లో పవన్, రవితేజ నటిస్తారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలు ఏవీ నిజం కాలేదు.

Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ ను ఇటీవల ప్రకటించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ సర్కిల్స్‌లో విన్పిస్తున్న తాజా బజ్ ఏమిటంటే ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి నటిస్తారా ? లేదా చూడాలి. కాగా లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మలయాళ వెర్షన్‌ని సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు కలిసి నటించారు.

Exit mobile version