Pavitra Lokesh: సీనియర్ నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే సీనియర్ నటుడు నరేష్ తో రిలేషన్ పెట్టుకున్నదని వార్తల్లోకి ఎక్కి ఫేమస్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఎక్కడ విన్నా పవిత్రా లోకేష్ పేరే వినిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ వివాదం తర్వాత అమ్మడు ఇండస్ట్రీకి దూరమవుతుంది, ఈ రిలేషన్ కారణంగా ఆమెకు అవకాశాలు రావడంలేదు అంటూ వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
ఇంకా చెప్పాలంటే ఈ వివాదం పవిత్రాకు బెన్ ఫిట్ అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు కొంతమందికి మాత్రమే ఈమె నటిగా తెలుసు.. ఈ వివాదంతో పవిత్రా అందరికి దగ్గరయింది. దీంతో పవిత్రా కనిపించగానే ప్రతి ఒక్కరు గుర్తుపడుతుండడం విశేషం. అందుకు ఉదాహరణ.. ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ లో ఆమె కనిపించగానే ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ క్రేజ్ ను సీనియర్ నటి క్యాష్ చేసుకొంటున్నదట. ఒక్కసారిగా తాన్ రెమ్యూనిరేషన్ రెండింతలు పెంచేసినట్లు టాక్ నడుస్తోంది. స్టార్ హీరో, చిన్న హీరో అని లేకుండా అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. పవిత్రా కూడా ఈ క్రేజ్ తనకు ఎంతో ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవిత్రా లోకేష్ పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.