Site icon NTV Telugu

OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్

Paruchuri Gopala Krishana

Paruchuri Gopala Krishana

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ స్టైల్, ప్రెజెంటేషన్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమాకథను నేను రెండు సార్లు చూసే వరకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మిస్టరీ, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సుజీత్ ఆ విషయంలో నిజంగా గ్రేట్. కథను చూపించిన తీరు, స్టైలిష్ ట్రీట్మెంట్ అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. స్క్రీన్ మీద పవన్ కనిపించాడు కాబట్టి అలాగే చూస్తూ ఉండిపోతే మనకు కథ ఈజీగా అర్థం అవుతోంది.

Read Also : Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్‌.. అదరగొట్టారుగా..

ఒకవేళ పవన్ కాకుండా వేరే హీరోతో ఇలాంటి కథ చేస్తే వర్కౌట్ కాదేమో. పవన్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఇలాంటి స్క్రిప్ట్ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. హీరో పాపకు సంబంధించిన ఓ షాట్ లో డైరెక్టర్ నన్ను థ్రిల్ చేసేశాడు. “ఆ సినిమాలో పవన్ కల్యాణ్‌ కాకుండా వేరే హీరో నటించి ఉంటే అంత ఇన్టరెస్ట్‌గా చూడలేము. పవన్ కల్యాణ్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌, అతని మాస్ అప్పీల్‌ వల్లే ‘ఓజీ’కి ఆ లెవెల్ హైప్ వచ్చింది” అని అభిప్రాయపడ్డారు పరుచూరి. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్‌ కు చాలా కాలం తర్వాత ఓజీతో ఓ మంచి హిట్ పడింది.

Read Also : Rajamouli : రాజమౌళికే ఎందుకిలా జరుగుతోంది..?

Exit mobile version