Site icon NTV Telugu

Paruchuri Venkateswara Rao: గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ రైటర్.. అదే కారణమట..

paruchuri brothers

paruchuri brothers

పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చరిత్రలు సృష్టించిన కథలు వారి కలం నుంచే జాలువారినవే. వయసు మీద పడినాకా ఇంటిపట్టునే ఉంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బక్కచిక్కిపోయి, అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన వారు ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా మారిపోయారని గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా ఈ వార్తలపై పరుచూరి వెంకటేశ్వరరావు తమ్ముడు, పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు.

ఆయన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ ” ప్రస్తుతం అన్నయ్య బాగానే ఉన్నారు  కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు.అవి పాటించడం వల్ల  ఆయన 10 కిలోలు తగ్గారు. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. 70 కేజీల వ్యక్తి 10 కేజీలు తగ్గే సరికి బక్కచిక్కినట్లు కనిపిస్తున్నారు. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. ఆ ఫోటో షేర్ చేసిన జయంత్ ను కూడా నేను ఇదే అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు. ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. ఇక అన్నయ్య ఫోటో చూసి చాలామంది చిక్కిపోయాడు, జుట్టుకు రంగు వేసుకోలేదు అన్నారు. కానీ ఒక అభిమాని మాత్రం ‘80 ఏళ్లు వచ్చాక ఓ వ్యక్తి ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కామెంట్‌ చేసే వాళ్లను నిలదీశాడు. ప్రస్తుతం అన్నయ్య క్షేమంగా ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version