Site icon NTV Telugu

Paresh Rawal : ఆస్కార్ అవార్డుల్లో లాబీయింగ్ ఉంది.. స్టార్ యాక్టర్ కామెంట్స్

Paresh

Paresh

Paresh Rawal : ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ ఉందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో మంది హాలీవుడ్ నటులు ఈ ఆరోపణలు చేశారు. కొన్ని దేశాల విషయంలోనే ఆస్కార్ అవార్డుల కమిటీ సానుకూలంగా ఉంటుందని.. మిగతా దేశాల్లో ఎంత గొప్ప సినిమాలు వచ్చినా పట్టించుకోరు అనే విమర్శలు లేకపోలేదు. తాజాగా స్టార్ యాక్టర్ పరేశ్‌ రావల్‌ కూడా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అవార్డుల కంటే తనకు వచ్చే ప్రశంసలే ముఖ్యం అన్నారు పరేశ్. అవార్డుల విషయంలో తాను ఎప్పుడూ పెద్దగా ఆశించబోనన్నారు. నేషనల్ అవార్డుల విషయంలోనూ లాబీయింగ్ కు ఆస్కారం ఉందన్నాడు.

Read Also : Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్

నేషనల్ అవార్డులు గతంలో ఇచ్చిన వాటిల్లో ఇలాంటి లాబీయింగ్ ఎక్కువగా ఉంది. ఆస్కార్ అవార్డుల విషయంలోనూ ఇది ఉంది. అవార్డులు అనేవి నిష్పక్షపాతంగా ఇచ్చినప్పుడే వాటిపౌ గౌరవం ఇంకా పెరుగుతుంది. అంతే గానీ లాబీయింగ్ తో, పొలిటికల్ పవర్ తో తెచ్చుకునేవి ఎందుకు అని ప్రశ్నించారు పరేశ్. కొన్ని రాజకీయ పార్టీలు, మూవీ టీమ్ కలిసి ఇలాంటి లాబీయింగ్ చేస్తారు. కానీ అలాంటివి సినిమా ప్రపంచానికి అస్సలు మంచివి కావు. అవార్డులను మించి ప్రశంసలే మనకు అతిపెద్ద ఆభరణాలు అంటూ చెప్పాడు పరేశ్.

Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్

Exit mobile version